తొమ్మిదోసారి శాఫ్ టైటిల్ భారత్ సొంతం
బెంగుళూరు స్టూడియో భారత్ ప్రతినిధి
చాంపియన్ భారత్
తొమ్మిదోసారి శాఫ్ టైటిల్ సొంతం
ఫైనల్లో ‘పెనాల్టీ షూటౌట్’లో కువైట్‌పై విజయం
బెంగళూరు:
దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు.లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది.
ఇదికూడా చదవండి.....
https://studiobharat.com/Funerals-by-water-in-Britain
ఆట14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.39వ నిమిషంలో లాలియన్‌జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి.అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి.ఆరో షాట్‌లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా...కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది.
విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
9 ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు(1993,1997,1999,2005,2009,2011,2015,2021, 2023) టైటిల్ సాధించింది.
24 ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు.23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు.
What's Your Reaction?