హైదరాబాద్ సన్ రైజర్స్ పరుగుల వర్షం

బెంగళూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 16, 2024 - 16:47
Apr 19, 2024 - 14:37
 0  4
హైదరాబాద్ సన్ రైజర్స్ పరుగుల వర్షం

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్

బెంగళూరు :-

పరుగుల సునామీ పారిన ఉత్కంఠ పోరులో సన్‌రైజ ర్స్,హైదరాబాద్ విజయం సాధించింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరగుల తేడాతో గెలుపొందింది.

సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం జరి గిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 288 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీతో విజృంభించగా అతనికి తోడు హెన్రీచ్ క్లాసెన్ 67 -31 బంతుల్లో 2×4, 7×6-,ఎయిడెన్ మార్క్మ్ 32,17 బంతుల్లో 2×4, 2×6,అబ్దుల్ సమద్ 37 (10 బంతుల్లో 4×4, 3×6, మెరుపులు మెరిపిం చడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన బెంగళూరు ధీటైన జవాబు నే ఇచ్చింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్(62)లు శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాటర్లు రాణించ కపోయారు. మిడిలార్డర్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్(83) కాసేపు మెరినా ఫలితం దక్కిలేదు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది. టి20 క్రికెట్ చరిత్ర లోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తన పేరిటే ఉండగా దానిని బద్దలు కొట్టింది...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow