హీరో స్ల్పెండర్ మతిపోగొట్టే ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్...
స్టూడియో భారత్ ప్రతినిధి

మతిపోగొట్టే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ బైక్...
ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కి.మి వెళ్లొచ్చు?
హీరో కంపెనీ తన పాపులర్ స్ల్పెండర్ బైక్‌లో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.ఇందులో అదిరే ఫీచర్లు ఉండొచ్చు.
మీరు కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనే యోచనలో ఉన్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.ప్రస్తుతం మార్కెట్‌లో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్లను (EV) అందిస్తున్నాయి.ఎలక్ట్రిక్ స్కూటర్లు,ఎలక్ట్రిక్ బైక్స్ (Bike) రెండూ కూడా ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ధర ప్రాతిపదికన ఫీచర్లు మారుతున్నాయి.ఎక్కువ రేటు పెట్టి కొంటే అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ టూవీలర్ ఇంటికి తీసుకువెళ్లొచ్చు.ఓలా దగ్గరి నుంచి ఏథర్,బజాజ్,హీరో,టీవీఎస్ ఇలా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి.
దిగ్గజం టూవీలర్ తయారీ కంపెనీగా కొనసాగుతూ వస్తున్న హీరో మోటొకార్ప్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1 కూడా మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ మీద కూడా పని చేస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.మరీముఖ్యగా స్ల్పెండర్‌లో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లోకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.హీరో స్ల్పెండర్ దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా కొనసాగుతూ వస్తోంది.జనాలు ప్రతి నెలా ఎక్కువగా కొనే బైక్ ఇదే కావడం గమనార్హం.
అందువల్ల కంపెనీ స్ల్పెండర్‌లోనే ఎలక్ట్రిక్ వేరియంట్ తీసుకువస్తే.. అమ్మకాలు కూడా భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.బ్రాండ్ ఇమేజ్ దీనికి దోహదపడొచ్చు.అంతేకాకుండా అదిరే ఫీచర్లతో కంపెనీ ఎలక్ట్రిక్ స్ల్పెండర్ బైక్ తీసుకురావొచ్చనే అంచనాలు ఉన్నాయి.ధర కూడా అందుబాటులో ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.ఇదే జరిగితే హీరో ఎలక్ట్రిక్ స్ల్పెండర్ బైక్ దుమ్ము రేపొచ్చు.
ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.10 వేలు,ఇ-స్కూటర్ పై రూ.4 వేల డిస్కౌంట్..రూ.10తో 40 కిమి వెళ్లొచ్చు.హీరో ఎలక్ట్రిక్ స్ల్పెండర్ బైక్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి.కంపెనీ ఇందులో పలు రకాల వేరియంట్లు అందుబాటులో ఉండొచ్చు.4 కేడబ్ల్యూ నుంచి 9 కేడబ్ల్యూ వరకు కెపాసిటీతో బ్యాటరీని అమర్చొచ్చని తెలుస్తోంది.అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ కూడా గంటకు 100 కిలోమీటర్లు ఉండొచ్చు.అలాగే కంపెన ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో అదనంగా 2 కేడబ్ల్యూ బ్యాటరీని అమర్చేలా ఫీచర్ ఏర్పాటు చేయొచ్చు.దీని వల్ల బైక్ రేంజ్ మరింత పెరుగుతుంది.అంతేకాకుండా ఈ బైక్ ధర విషయానికి వస్తే..రూ.లక్ష నుంచి ప్రారంభం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.వేరియంట్ ఆధారంగా బైక్ ధర మారుతుంది.అందువల్ల అధిక ఫీచర్లు,బ్యాటరీ రేంజ్ ఉన్న వేరియంట్ ధర ఎక్కువగా ఉండొచ్చు.
What's Your Reaction?






