యాదగిరిగుట్టలో పది పీటలను కొనుగోలు చేసిన ఆలయ అధికారులు
యాదగిరి స్టూడియో భారత్ ప్రతినిధి
యాదగిరిగుట్టలో పది పీటలను కొనుగోలు చేసిన ఆలయ అధికారులు
యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదం పై అధికారుల అప్రమత్తమయ్యారు. ఇటీవల ఆలయంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క,మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.పీటల వివాదం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారుల అప్రమత్తమయ్యారు. ఆలయ సిబ్బంది పది సమాంతర పీటలు కొనుగోలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం పీటలను వాడుకలో తేనున్నారు.పాతవి 4,కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వివిఐపిలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు.
What's Your Reaction?