జగ్గయ్యపేట నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల విషయంలో తనిఖీలు ఎక్కడ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్ లు.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం లో మినరల్ వాటర్ ప్లాంట్ లు పుట్ట గొడుగుల పుట్టుకు వస్తున్నాయి....
నియోజకవర్గంలో ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్ లు ఉన్నాయో అధికారులకే తెలియదు......? ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్లకు అను మతులు ఉన్నాయో లేదో అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి...... ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్ లు నిబంధనలు పాటిస్తున్నాయో..? ఆ దేవుడికి తెలియాలి..? పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్ లు ఉన్న సంబంధిత అధికారులు నేటికీ తనిఖీలు చేసిన దాఖలు లేవని ప్రజలలో విమర్శలు వినిపిస్తు న్నాయి.... కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్ లు శుభ్రత పాటించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటివి జరుగుతున్నాయని దీంతో మినరల్ వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు సరఫరా చేస్తున్న మంచినీరు తాగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.... నిబంధనలు పాటించని శుభ్రత పాటించని అనుమతులు లేని మినరల్ వాటర్ ప్లాంట్ లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా..?అని నియోజక వర్గ ప్రజలలో ప్రశ్న, ప్రశ్నగానే మిగిలిపోయింది.
అధికారులు ఎప్పుడైనా మినరల్ వాటర్ ప్లాంట్ పరిశుభ్రతను గాని, TDS(Total Dissolve d Solids), PH(potential of Hydrogen), ORP(Oxidation Reduction Potential) ఎంతెంత మెయింటైన్ చేస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించారా? అసలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మినరల్ వాటర్ ప్లాంట్స్ నడిపే యజమానులకు ఇవి తెలుసా? ఎవరో ఒక అనామకుడిని వాటర్ ప్లాంట్ దగ్గర పెట్టడం ఆ అనామకుడు చెప్పిందే వేదం చేసిందే రైట్ నన్ను దుస్థితిలో వాటర్ ప్లాంట్ లు ఉన్నాయి. కొన్ని ప్రముఖ వాటర్ ప్లాంట్ల మినహా జగ్గయ్యపేట పట్టణంలో , మండలాలలో గ్రామాలలో ఎందుకు ఇంత విచ్చలవిడిగా మిన్నలను వాటర్ ప్లాంట్లకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు? మినరల్ వాటర్ ప్లాంట్ లో యజమానులు లక్షలు గడించడానికా? అధికారులు నెలనెలా ముడుపులు తీసుకోవడానికా అంటూ మేధావులు సామాజిక వేత్తలు ప్రజల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు. మినరల్ వాటర్ ప్లాంట్ నడుపుతున్న వారు ఒక 20 లీటర్ల క్యాన్ 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. (ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ల మినహా). ప్రజల ప్రాణాలతో వారు చెలగాటమాడుతూ అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు.
ఈ వాటర్ త్రాగడం వలన మానవుని జీర్ణ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపటమే కాకుండా ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోయి ఎముకల చుట్టూ ఉన్న కాల్షియం కూడా తినేస్తుంది. ఇంకా అనేక రకాల వ్యాధులకు కారణం కూడా అవుతాయి. మన ఇంటి ముందుకు వాటర్ కాన్ వచ్చింది 15 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నామా లేదా అనేది చూస్తున్నారు కానీ అది ఏ విధంగా తయారవుతుంది ఎలా తయారు చేస్తున్నారు దాంట్లో ఏమేమి కలుస్తున్నాయి అనేది ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. దీనిని ఆసరాగా తీసుకొని గ్రామాలలోని మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులు వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్లాంట్ ను నడుపుతూ లక్షలు గడుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి అధికారులు గ్రామాలలో, జగ్గయ్యపేట పట్టణంలో గల మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి వాటి వలన ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని సామాజికవేత్తలు, ప్రజలు కోరుకుంటున్నారు.
What's Your Reaction?






