భక్తులకు ప్రసాదాలు అందించిన రాయవరపు అశోక్ కుమార్ & ఫ్రెండ్స్
వేదాద్రి స్టూడియో భారత్ ప్రతినిధి
భక్తులకు ప్రసాదాలు అందించిన రాయవరపు అశోక్ కుమార్ & ఫ్రెండ్స్
వేదాద్రి
జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ యంయల్ఏ మదలగిరి సోదరులు రాయవరపు అశోక్ కుమార్ మరియు వారి ఫ్రెండ్స్ కలసి తొలి ఏకాదశి పురస్కారించుకొని ఉచితంగా ప్రసాదాలుగా అల్పాహారాని స్వామి వారిని దర్శించుకొనుటకు విచ్చేసిన భక్తులకు అందించారు.గుంటూరు జిల్లా వాస్తవ్యులు రాయవరపు అశోక్ కుమార్ వాసవి క్లబ్ గుంటూరు వ్యవస్థాపక అధ్యక్షులు గాను,
గత పదిహేను సంవత్సరాల నుండి వేదాద్రి దేవస్థానం వద్దకు విచ్చేసిన భక్తులకు ప్రసాదాలుగా అల్పాహారం అందిస్తున్నామని వారు తెలియజేశారు.తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సుమారు 5000 మంది భక్తులకు అల్పాహారంగా స్వీట్,టమాటా బాత్, పులిహోర, టమాటా రైస్,సాంబారన్నం, పెరుగన్నాని అందించడం జరిగిందని వారు తెలియజేశారు.భక్తులు వీరి దానం గుణం పట్ల హర్షం వ్యక్తం చేసారు.వీరికి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని భక్తులు భగవంతుని కోరుకున్నారు.
What's Your Reaction?