జాతీయ స్థాయి నృత్య పోటీల వాల్ పోస్టర్ ని విడుదల చేసిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

జాతీయ స్థాయి నృత్య పోటీల వాల్ పోస్టర్ ని విడుదల చేసిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట
జాతీయ స్థాయిలో కూచిపూడి మరియు భరత నాట్యం నృత్య పోటీలు నిర్వహణ జగ్గయ్యపేట పట్టణంలో ది:25.02.2024 వ తేదీన నిర్వహించడం జరుగుతున్న సంధర్భంగా సంబంధించిన వాల్ పోస్టర్ ని ప్రభుత్వ విప్, తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్,స్థానిక ప్రభుత్వ శాసన సభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా ప్రతి ఒక్కరు ఇటువంటి సాంస్కృతిక జాతీయ స్థాయి పోటీల నిర్వహించేవారికి ప్రతి ఒక్కరు ఆదరించాలని ఆయన తెలియజేసారు.
ఈ సందర్భంగా సత్య కూచిపూడి డ్యాన్స్ అకాడమీ సంస్థ మేనేజ్మెంట్ ఓగిరాల రామకృష్ణ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతములో కళలు అంతరించి పోకూడదన్న ఉద్దేశ్యంతో సత్య కూచిపూడి డ్యాన్స్ అకాడమీ సంస్థ వారు ది:01.01.2023 నుండి జగ్గయ్యపేట పట్టణంలో విద్యార్థినీ, విద్యార్థులకు కూచిపూడి మరియు భరతనాట్యం నేర్పుటకు సాంస్కృతికశాఖ (ఆర్ నెం.4198-2023) ద్వారా పాఠశాలలో నిర్వహించటం జరుగుతుంది అని తెలియజేయుటకు సంతసించుచున్నామని వారు తెలియజేశారు.
ఇప్పటికే అకాడమీ లో నేర్చుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు దేశ విదేశాలలో ప్రదర్శన యిచ్చి విశేష అనుభవం కలిగి అనేక అవార్డులు పొందిన నాట్య గురువులచే శిక్షణ ఇచ్చుచున్నామని వారు తెలియజేశారు.
తద్వారా అకాడమీ విద్యార్థినీ,విద్యార్థులు దేశ రాజధాని మరియు ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో వివిధ కేంద్ర మరియు రాష్ట్ర మంత్రుల సమక్షంలో మరియు వివిధ పుణ్యక్షేత్రములు, దేవాలయము లలో నవరాత్రులు యందు ప్రముఖ నగరము లలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ,అక్కడి వారి మన్ననలు, బహుమతులు గుర్తింపు పొంది యున్నామని వారు తెలియజేసారు.
దశదిశల జగ్గయ్యపేట పేరు ప్రఖ్యాతలు జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా సంస్థ వారిచే మొట్ట మొదటిసారిగా జాతీయస్థాయి కూచిపూడి మరియు భరతనాట్యం ప్రదర్శన పోటీలు ది:25.02.2024 తేదీన నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేసారు.ఈ కార్యక్రమమునకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువులు నంది అవార్డు గ్రహీతలు డాక్టరేట్ మరియు ఇతర ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా విచ్చేయుచుచున్నారని సంస్థ వారు తెలిపారు.ఇంతటి గొప్ప కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సంస్థ వారు తెలియజేశారు.
What's Your Reaction?






