విజయవాడ సెంట్రల్ లో గెలుపు ఎవరిది?
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి
విజయవాడ సెంట్రల్ లో గెలుపు ఎవరిది?
మల్లాది ఏవరినైతే నమ్ముకున్నారో వారినే నమ్ముతున్న వెలంపల్లి
విష్ణుకు బోమ్మ చూపించిన వారే వెల్లంపల్లికి చూపించనున్నారా?
బోండా వ్యతిరేకులను కూడగట్టడంలో వైఫల్యం?
బోండా గెలుపు ఖాయమా?
గెలుపు ధీమాలో బోండా?
విజయవాడ :
రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్లలో విజయవాడ సెంట్రల్ ఒకటి.అటువంటి సీటుకు వెల్లంపల్లిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించడం జరిగింది.వెలంపల్లికి సీటీ ఇవ్వడం పట్ల విష్ణు అంటే ప్రాణం తీసుకోనే ఆయన అనునయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు.ఆందోళన చేశారు.హమ్మయ్య సీటు నాకు రావచ్చు అంటు గుండే మీద చేయి వేసుకుని పడుకున్నారు మల్లాది.తెల్లవారనే లేదు మల్లాది శిబిరం ఖాళి.ఎదో కొద్దిమంది తప్ప మల్లాది శిబిరం ఖాళి చేసి తన శిభిరంలో వచ్చేలాగ పావులు కదపడంలో సెక్సెస్ అయ్యారు మాజీమంత్రి వెల్లంపల్లి .రెండవ రోజు నుండి మల్లాది విష్ణు వైపు చూసే వారే లేరు.
ఇంటగెలచిన వెలంపల్లి రచ్చగెలుస్తారా
ఇంటగెలచిన వెలంపల్లి రచ్చగెలుస్తారా అన్నదే (మిలియన్ డాలర్ల)కోట్లాది రుపాయల ప్రశ్న. గత కొద్ది రోజులుగా వెలంపల్లి అదే టీమ్ లు అంటే మల్లాది ఎవరినైతే నమ్ముకున్నారో వారినే నమ్ముకోవడం చూస్తుంటే వెలంపల్లి గెలుపుపై అనేక సందేహలు కలుగుతున్నాయి.గత ఎలక్షన్లలో మల్లాది గెలుపు( అంటే కొంతమంది గెలుపు కాదంటారు అది ఆప్రస్తుతం) లో కీలక పాత్ర వహించిన వారిలో కోగంటి సత్యంలాంటి కొంత మంది బోండా శత్రువులు ఆయన ఓటమికై కసితో పని చేశారు.అనంతరం మల్లాది గెలుపుకు కృషి చేసిన వారిని పక్కున పెట్టి భజన బృందానికి చోటు కల్పించారు.దాంతో మల్లాది గెలుపుకు సర్వశక్తులు ఓడ్డిన వారు సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ప్రతి ఓటు కీలకమే నాడు 25 ఓట్లే నాడు కీలకం అయ్యాయి.భజన బృందాన్ని నమ్ముకున్న మల్లాదిని ఓక దారి చేశారు.భజన పరుల వల్లే గెలిస్తే మరి మల్లాదికి నియోజక వర్గంలో మైనస్ ఎందుకు అయ్యింది.పేపర్లలో టీ.విలలో ఉదర కోట్టినా పరిస్థితి ఏమైంది అని వైసిపి కార్యకర్తలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు అదే భజన బృందం వెలంపల్లి పక్కన చేరడం జరిగింది.భజన పరుల అవసరం ఉంది కాని వెలుపల్లి గెలుపుకు బోండా ఓటమికి కసితో పని చేసే సైనికుల అవసరం ఉంది.వారిని గుర్తించి వారి ద్వార ఓటును వేయించుకోగలిగినప్పుడు మాత్రమే వెలంపల్లి గెలుపు సులువు అవుతుంది.ఇదే పద్దతి కొనసాగితే బోండ గెలుపు నల్లేరు మీద నడకే.
(త్వరలో విజయవాడ తూర్పు నియోజక వర్గంపై మరిన్ని కథనాలతో)
What's Your Reaction?