గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి పనులు

చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 23, 2024 - 11:31
 0  77
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి పనులు

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి పనులు...

చిల్లకల్లు

జగ్గయ్యపేట మండలంలో 19 గ్రామాలలో 13,496 మంది జాబ్ కార్డు వారికి 100 రోజుల గ్రామీణ ఉపాధి పని ద్వారా గ్రామీణ కూలీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రభుత్వ విప్,స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను సూచనల మేర ఇప్పటికే సుమారు 45 రోజుల పాటు ఒక్కొక్క జాబ్ కార్డుదారునికి పని కల్పించడం జరిగింది.ఒక్కొక్క జాబ్ కార్డుదారునికి రోజుకి 258 రూపాయలు కూలీ నగదును చెల్లించడం జరుగుతుంది.

ఇప్పటికే జగ్గయ్యపేట మండల డెవలప్ మెంట్ అధికారి (ఎంపిడిఓ) యం రమేష్ ఆదేశాల మేరకు మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 15000 మీటర్ల దూరం కాల్వలు మరమ్మతులు మరియు ఏర్పాటు చేయడం జరిగింది.రైతులకు అవసరమైనటువంటి నీటి కుంటలు, పశువుల కుంటలు ఏర్పాటు చేయడం జరిగింది.నిమ్మ,జామా,మునగ,మామిడి తోటల మెయింటనెస్ మరియు నర్సరీ పెంపకం లాంటి పనుల ద్వారా జాబ్ కార్డు దారులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది.

తద్వారా 45 రోజుల పని దినాలలో 13,496 మంది జాబ్ కార్డు గ్రామీణ కూలీలకు సరాసరి 5,78,507 పని దినాలను కల్పించి,పని చేసిన వారికి సుమారు 14 కోట్ల 85 లక్షల రూపాయల నగదును జాబ్ కార్డు గ్రామీణ కూలీల నగదును వారి వ్యక్తిగత బ్యాంకు అక్కౌంట్ లో జమ చేయడం జరిగిందని ఏపిఓ ఐవి సంతోష్ కుమార్ తెలియజేశారు.ఇదేకాకుండా 60/40 క్రింద సచివాలయాలు,ఆర్.బి.కె లు, హెల్త్ క్లీనిక్ నిర్మాణాలకు కోటి రూపాయల నిర్మాణ మెటీరియల్ లను అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు.

100 రోజులలో మిగిలిన పనిదినాలను జాబ్ కార్డు ఉన్న గ్రామీణ కూలీలకు త్వరలో కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు మాత్రం 13 డిశంబర్ 2023 వరకు మాత్రమే కూలీ డబ్బులు అందాయని,మిగిలిన పని దినాలకు సంబంధించిన జగ్గయ్యపేట మండలంలో పని చేసిన నగదు మొత్తం సుమారు 5 లక్షల రూపాయలు కూలీలందరికీ అందాల్సి ఉందని,వెంటనే వాటిని అందించాలని వారు ప్రభుత్వాని కోరుతున్నారు.మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow