కాలుష్యం వల్ల తగ్గతున్న దిగుబడికి సమీప కర్మాగారాలే ఆర్థిక సహాయాన్ని అందించాలి - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

వర్షాభావ ప్రభావం వల్ల నష్టపోతున్న రైతాంగాని ఆదుకోవాలి
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్,యన్.టి.ఆర్ జిల్లా విజయవాడ వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ వినతి పత్రం ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో మాగని,మెట్ట భూములలో పంటలను సాగు చేయడం జరుగుతుంది.ఇప్పటికే జగ్గయ్యపేట ప్రాంతం కాలుష్యం వల్ల రైతాంగం సాగు చేయడానికి పెట్టుబడులు విపరీతంగా పెరిగి పోతున్నాయి.
అధిక పెట్టుబడులు పెట్టినప్పటికీ కాలుష్యం వల్ల ఇతర ప్రాంతాలలో పంట దిగుబడుల కన్న సుమారు నలభై శాతం తగ్గుతుందని,కర్మాగారాల వల్ల నష్టమే తప్ప రైతులకు ఒరిగింది ఏమి లేదని ఆయన తెలియజేశారు.ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు తక్కువగా పడటంతో వర్షాభావం ప్రభావం వల్ల జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతం సైతం కరువు తాండ విస్తుందని ఆయన అన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో ఒక్కవైపు కాలుష్యంతో ప్రతి ఏటా పంట దిగుబడులు తగ్గుతుంటే మరో వైపు వర్షాభావ ప్రభావం వల్ల రైతులు పూర్తిగా రోడ్డు పాలవుతున్నారు.
ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ ఎద్దడి వల్ల పంట నష్టపోయిన జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రైతులను ఆదుకోవాలని,ప్రతి ఏటా కాలుష్యం వల్ల తగ్గతున్న దిగుబడికి ఆయా ప్రాంతాలలో ఉన్న సిమెంట్,కెమికల్,లైట్ వేట్ బ్రిక్స్ మరియు వివిధ కర్మాగారాలే రైతాంగాని ఆర్థికంగా ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వ్రాతపూర్వక వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ విజయవాడ కార్యాలయంలో సమర్పించారు.
What's Your Reaction?






