రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాజస్థాన్ స్టూడియో భారత్ ప్రతినిధి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..
రాజస్థాన్
199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.దాదాపు 5.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మొత్తం 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి ప్రచారంతో హోరెత్తించాయి.ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.బిజెపి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై ఆధారపడింది.ఆయన కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.పలు ర్యాలీలు,రోడ్డుషోలలో పాల్గొన్నారు..
What's Your Reaction?