ఏకాదశీమాహాత్మ్యం - తులసిమహిమ

స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 11, 2024 - 06:42
 0  55
ఏకాదశీమాహాత్మ్యం - తులసిమహిమ

ఏకాదశీమాహాత్మ్యం - తులసిమహిమ

ఏకాదశీ మాహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది - 'విధివిధానంగా తులసీవృక్షాన్ని నాటినవారివంశంలో మరణించిన వారూ,ప్రస్తుతం జీవించి ఉన్నవారూ,భవిష్యత్తులో జన్మించేవారూ,అందరూ కల్పాంతంవరకు శ్రీహరి ధామంలో నివసిస్తారు. 

తులసిసుగంధం వాయువుద్వారా వ్యాపించినంతమేర జీవరాశు లన్నీ పవిత్రం అవుతాయి. తులసీవనంలో తులసి విత్తనాలు క్రిందపడినచోట, పితృగణాలకు పిండప్రదానం చేసినవారు స్వయంగా వైకుంఠం చేరుకుంటారు. 

ప్రతిదినమూ తులసిని దర్శించడం, స్పృశించడం,నాటడం,చింతనం, కీర్తనం,ప్రణామం,గుణశ్రవణం,అర్చనం,సేవనం మొదలగునవి చేసినవారి సర్వపాపాలు భస్మీపటలమై కృష్ణభగవానుని నివాసాన్ని పొందుతారు. 

హాట్ న్యూస్ ని చదవండి :- ఆశా వర్కర్‌లకు కేటీఆర్‌ భరోసా అధైర్యపడొద్దు అండగా నేనున్నా..  - https://studiobharat.com/Dont-get-discouraged-by-KTRs-assurance-to-Asha-workers

తులసీజలంతో పవిత్రం అయినగృహంసమీపానికి యమదూతలు కూడా రారు. కరక్కాయ రోగాలను నయం చేసినవిధంగా తులసి దారిద్ర్యాన్ని నాశనం చేస్తుంది. తులసిసమీపంలో ప్రాణత్యాగం చేసినమాత్రంచేత వ్యక్తి భగవంతునిదగ్గరకు చేరుకుంటాడు. 

నిద్ర లేచి స్నానం చేసినవెంటనే తులసిదర్శనంచేసుకున్నవారికి ఆరోజు రాత్రి, పగలు చేసిన పాపాలు వెనువెంటనే నాశనం అవుతాయి. ప్రతిదినమూ తులసికి జలం అర్పించినవారు నిశ్చయంగా శ్రీహరిధామంలో నివసిస్తారు. 

ప్రళయం అన్నింటినీ దహించివేసినవిధంగా వ్యక్తి సర్వపాపాలుతులసిమహిమను వినడంద్వారా, దర్శించడంద్వారా, నాటడంద్వారా, జలం సేవించడంద్వారా, ప్రణామాలు చేయడంద్వారా దగ్ధమైపోతాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow