శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 18, 2023 - 12:19
 0  26
శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం...

ఇంద్ర‌కీలాద్రి, శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 4వ రోజైన బుధ‌వారం ఆశ్వ‌యుజ శుద్ధ చ‌వితి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తుంది.

యాదేవీ స‌ర్వభూతేషు ల‌క్ష్మీరూపేణ సంస్థితా..అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి..అని చండీ స‌ప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నైవేద్యంగా పంచభోగాలైన తామ‌ర పేలాల పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డు, పులిహోర‌, ద‌ద్యోజ‌నాల‌ను నివేదిస్తారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow