అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 16, 2024 - 14:30
 0  3
అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ :

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామన వమి కావడంతో అధికారు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు ఏడు వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమంతించాలని నిర్ణయించింది.

శ్రీరామనవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్,నాగేశ్వర నాథ్ జోన్,హనుమాన్ గర్హి టెంపుల్ జోన్,కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేపడుతున్నారు.

భక్తులక సౌకర్యార్ధం 24 గంటల పాటు పని చేసే విధంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు.రామ జన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరా లు,.50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow