పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు
కళ్యాణ దుర్గం స్టూడియో భారత్ ప్రతినిధి
గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్స్ నిర్లక్ష్యం
పూర్తిస్థాయిలో వైద్యం అందించడంలో విఫలం
ముట్టుకోవడంలో ఆహిష్టంగా గా వ్యవహరించడం బాధాకరం.
కళ్యాణ దుర్గం
కళ్యాణదుర్గం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోగ బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించలేక పోతున్నారని,డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో రోగుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎదురు చూసే పరిస్థితి ఏర్రోపడిందని రోగులు రోజుకు వందల సంఖ్యలో డబ్బు లేని నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకోలేని స్తోమత లేని నిరుపేదలే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు.
పేదల ఆరోగ్య పట్ల పేదల పెద్దగా శ్రద్ధ తీసుకోలేరని చేతుల పట్టుకోవడానికి కూడా అహిష్టంగా డాక్టర్ల ఫీలవుతున్నారని రోగులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.పేదల పట్ల పేదల ఆరోగ్య పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని,ఈ హాస్పిటల్ లకు స్పెషలిస్ట్ 11 మంది డాక్టర్లు ఉన్నారని,ఈ 11 మంది డాక్టర్లు రోజు పూర్తిస్థాయిలో వీధుల్లో లేరని బహిరంగ రహస్యమే.కొంతమంది డాక్టర్లు మాత్రమే తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని,రోజు డాక్టర్లు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించ లేకపోతున్నారని,సమయం ఉన్న పేషెంట్లు ఉన్నా,
ఇవి ఏమి పట్టించుకోకుండా బయటకు వెళ్ళి పోతారని పలువురు గుసగుసలు ఆడుకుంటున్నారు.మరల వస్తారని ఎదురు చూసిన పేషెంట్లకు ఓపి చీటీలు తీసుకున్న రోగులు,డాక్టర్ల కోసం ఎదురు చూసి,డాక్టర్ల కోసం ఆరా తీసినప్పుడు సమయం అయిపోయింది.డాక్టర్లు రారు లేరు రేపు రండి అని చెప్పి పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.కళ్యాణ దుర్గం ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్య పనితీరు విషయముపై జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రజలు కోరుతున్నారు.
What's Your Reaction?