తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్:
తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది.మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబరు 17న ముగియనున్నది.దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటివరకు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన తర్వాత షెడ్యూలును రూపొందించింది.
ఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూలును ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది.తక్షణం ఎన్నికల కోడ్ ఈ ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30 న తేదీన నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూలులో పేర్కొన్నది.డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి అదే రోజులు ఫలితాలను విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
నవంబర్ 3వ తేదీన ఎన్నికల గెజిట్ విడుదల కానుండగా..10వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల స్క్రూట్నీ..నవంబర్ 15వ తేదీ నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీగా షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీకి జనరి 16వ తేదీ వరకు నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ మిజోరాంతో కలిపి నిర్వహిస్తున్నందున దాదాపు నెల రోజుల ముందే పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది.గతేడాది డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా 11న ఫలితాలు వెలువడ్డాయి.
కానీ అసెంబ్లీ ఫస్ట్ సెషన్ జనవరి 17-2019న జరగడంతో తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం జనవరి 16-2024 వరకు ఉంటుంది.ఎన్నికలు సకాలంలో వస్తాయా?..లోక్‌సభతో పాటు కలిపి జమిలిగా వస్తుందా?..ఒక నెల ముందే జరుగుతుందేమో!..రెండు నెలలు ఆలస్యం కావచ్చేమో!.. ఇలాంటి అనేక సందేహాలకు తెర దించుతూ షెడ్యూలు విడుదలైంది.
What's Your Reaction?






