మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారా 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 8, 2025 - 13:18
 0  129
మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారా 

మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారా 

ముక్త్యాల గ్రామ పంచాయతీ హెచ్చరిక బోర్డుల ఏర్పాటు తో చర్యలకు ముందుకొచ్చింది.

అనధికార లే అవుట్ వెంచర్ దారుల కాసుల వర్షాన్నికి అండగ మున్సిపాలిటీ,కొన్ని గ్రామ పంచాయతీలు

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట మున్సిపాలిటీ మరియు చిల్లకల్లు, తిరుమలగిరి,షేర్ మహమ్మద్ పేట పలు హైవే వెంబడి గల పంచాయతీ పరిధిలలో అనధికార లే అవుట్ లు విచ్చలవిడిగా పుట్ట గొడుగులుగా వెలుస్తున్నాయి.జగ్గయ్యపేట మున్సిపాలిటీ లో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ సీటు ఖాళీ గా ఉండటం,వార్డులలోను,పంచాయతీ పరిధిలో గల సచివాలయాలలో గల టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనులను మర్చిపోవడంతో వారు నిద్ర పోతున్నట్లుగ నటించడం తో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిలుపడి రియల్ ఎస్టేట్ వెంచర్ దారులకు కోట్లలో కాసుల వర్షం కురిపిస్తుందనే చెప్పుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ లలో స్థానిక మున్సిపాలిటీకి,గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సి.ఆర్.డి.ఏ ని ఏర్పాటు చేసి ల్యాండ్ కన్వర్షన్,లేఅవుట్,సి.ఆర్.డి.ఏ అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వ ఆర్డర్ ని ముందుకు తీసుకొని వచ్చింది.

అసలు దీనిని జగ్గయ్యపేట మున్సిపాలిటీ గాని,కొన్ని గ్రామ పంచాయతీ లు గాని పెడ చెవిన పెట్టాయనే చెప్పకోవచ్చు.మున్సిపల్ కౌన్సిల్ లో సైతం వాడీ వేడీ చర్చలు జరిగాయి.జగ్గయ్యపేట మున్సిపాలిటీ గాని,చిల్లకల్లు,తిరుమలగిరి,షేర్ మహమ్మద్ పేట మరియు ఇతర పంచాయతీలు పట్టించుకోకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.కాని జగ్గయ్యపేట మండలంలో ముక్త్యాల గ్రామ పంచాయతీ వారు వ్యవసాయ భూమి కన్వర్షన్ లేదని,లే అవుట్ మరియు సి.ఆర్.డి.ఏ అనుమతులు లేవని,అనధికార లే అవుట్ లుగా గుర్తించడం జరిగిందని,ప్లాట్లు అమ్మకం కొనటం చట్టపరమైన నేరమని ఎవ్వరు సాహసం చేయకపోయిన,ప్రభుత్వ ఆదేశాలను సారంగా కొన్ని లేఅవుట్ ల వద్ద హెచ్చరించక బోర్డులను ఏర్పాటు చేసారు.ఇటువంటి ప్రభుత్వ ఆదాయాని గండి పడకుండా ప్లాట్ల ఏర్పాటు చేసిన వెంచర్ ల వద్ద బోర్డులను ఏర్పాటు చేయడం పట్ల ముక్త్యాల గ్రామ పంచాయతీ వారికి ప్లాట్ల కొనుగోలు దారులు వారు నష్ట పోకుండా చూసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆహారకల్తీ తెలుగు రాష్ట్రాలు రెండు,నాలుగు స్థానాలలో నిలబడాయి  - https://studiobharat.com/Telugu-states-stand-at-second-and-fourth-positions-in-food-adulteration

కాని జగ్గయ్యపేట మున్సిపాలిటీ గాని,చిల్లకల్లు,తిరుమలగిరి,షేర్ మహమ్మద్ పేట మరియు ఇతర పంచాయతీలు పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు కాసుల వర్షం కురిపించడానికి అండగా ఉంటున్నారనే ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.దీని పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్లాట్ల కొనుగోలు దారులకు అటు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా చూడాలని పలువురు మేధావులు కోరుకుంటున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow