ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 25, 2023 - 19:43
 0  25
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు.అలాగే ఆలయ అర్చకులు దుర్గమ్మకి 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు.కాగా సెప్టెంబరు 8వ తేదీన (నాలుగో శుక్రవారం) ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు.

శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం అంటే శ్రీమహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది.శ్రావణమాసంలో చేసే నోములు,వ్రతాలు,పూజల వల్ల లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.శ్రావణమాసం రెండవ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.శ్రావణమాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల పసుపు కుంకాలతో,సౌభాగ్యంతో ఉంటారని భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow