కాలేజీ స్టూడెంట్ నేడు అదే కళాశాలకు ప్రిన్సిపల్‌

కామారెడ్డి స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 1, 2024 - 16:23
 0  78
కాలేజీ స్టూడెంట్ నేడు అదే కళాశాలకు ప్రిన్సిపల్‌

కామారెడ్డి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన జయ కుమారి ఆనందానికి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎందుకంటే ఆమె గతంలో ఇదే కాలేజీలో విద్యార్థిగా చదువుకున్నారు. నేడు అదే కాలేజీలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారుచిన్నతనంలో మనం చదువుకున్న స్కూల్స్,కాలేజీలకు వెళ్తే తెలియకుండానే మెుహంపై చిరునవ్వు కనిపిస్తుంటుంది.

మనం చేసిన అల్లరి..తిరిగిన పరిసరాలు..

చదువుకున్న క్లాస్ రూం ఇలా అన్ని కళ్లముందు కదలాడుతుంటాయి. ఆనాటి జ్ఞాపకాలు మదిని పులకింపజేస్తాయి.అలాంటిది చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపల్‌గా వెళితే ఎలా ఉంటుంది. ఆ ఊహ చాలా బాగుంది కదా. కానీ నిజంగానే ఓ మహిళ తాను చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపల్‌ అయ్యారు. నాడు అల్లరి చేసి.శ్రద్ధగా పాఠాలు విన్న చోటే పాఠాలు బోధిస్తున్నారు. నాడు కాలేజీలోని ఓ తరగతి గదిలో స్టూడెంట్‌గా కూర్చున్న ఆమె.నేడు అదే కాలేజీలో అత్యున్నత స్థానంలో కూర్చున్నారు. ఆమె కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పళ్లాడి జయకుమారి....

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేపట్టగా.. తాను ఇంటర్ చదువకున్న కాలేజీలోనే జయ కుమారి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమె ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కామారెడ్డికి చెందిన జయ కుమారి. 1983-85 మధ్య కాలంలో కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో సీఈసీ కోర్సుతో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత భర్త రణవీర్ ప్రోత్సాహంతో డిగ్రీ, పీజీ, ఎంఎడ్‌ పూర్తి చేశారు. 1995లో డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. చుక్కాపూర్, కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌గా చాలాకాలం విధులు నిర్వహించిన జయ కుమారికి ప్రమోషన్ వచ్చింది. గాంధారి, మాచారెడ్డి బాన్సువాడ గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీల్లో విధులు నిర్వహించారు.తాజాగా కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు...తాను ఈ స్థాయిలో ఉండటానికి తన ప్రోత్సాహం ఎంతో ఉందని జయ కుమారి వెల్లడించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు.

బాన్సువాడలో విధులు నిర్వర్తించే సమయంలో కాలేజీలో 80 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. పిల్లలు చదువుకు దూరమవుతున్నారని గ్రహించి దాదాపు 600 మంది విద్యార్థులను కాలేజీలో చేర్పించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తనలో చాలా మందికి ఆత్మ సంతృప్తిని కలిగించిందని అన్నారు. ప్రస్తుత పోటీ పరీక్షల్లో కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్న స్థానానికి ఎదుగుతామనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా కష్టపడాలని చదవాలన్నారు. ఇంటర్‌ తర్వాత ఫ్యూచర్ బాగుండే కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow