నిద్రపోయేటప్పుడు పక్షులు చెట్ల పై నుంచి క్రింద పడవో తెలుసా
స్టూడియో భారత్ ప్రతినిధి
నిద్రలో ఉన్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం సాధారణం. అంటే నిద్రపోయేటప్పుడు స్పృహ ఉండదు. నిద్రలో మంచం మీద నుంచి కింద పడిన అనుభవాలు మనలో చాలా మందికి ఉన్నాయి. ఐతే చెట్ల కొమ్మలపై నిద్రపోయే పక్షులు మాత్రం నిద్రపోయేటప్పుడు జారి కిందపడవు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.నిద్రలో ఉన్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం సాధారణం. అంటే నిద్రపోయేటప్పుడు స్పృహ ఉండదు. నిద్రలో మంచం మీద నుంచి కింద పడిన అనుభవాలు మనలో చాలా మందికి ఉన్నాయి. ఐతే చెట్ల కొమ్మలపై నిద్రపోయే పక్షులు మాత్రం నిద్రపోయేటప్పుడు జారి కిందపడవు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా.ఈ ప్రపంచంలో మనల్ని ఆలోచింపజేసే విషయాలు చాలానే ఉన్నాయి.
వాటిలో పక్షలు కూడా ఒకటి.
ఎందుకంటే ఇవి గాల్లో ఎగురుతాయి. పక్షులు అద్భుతమైన రోజువారీ జీవితాన్ని గడుపుతాయి. గూడు కోసం, తమను తాము పోషించుకోవడానికే ఇవి నిత్యం శ్రమిస్తాయి.పొద్దున్నే నిద్రలేచి ఆహారం కోసం వెళ్తాయి..చెట్లపై ఇళ్లు నిర్మించుకొని అక్కడే నివసిస్తాయి.పక్షులు చెట్ల కొమ్మలపై నిద్రిస్తున్నప్పుడు ఎందుకు నేలమీద పడవు.. కింద పడకుండా సమతుల్యంగా ఎలా ఉంచుకుంటాయి.వంటి సమాధానాలు తెలుసుకునే ముందు..అసలు పక్షులు ఎలా నిద్రపోతాయో తెలుసుకోవాలి.నిజానికి పక్షులు నిద్రపోయేటప్పుడు ఒక కన్ను తెరచి నిద్రపోతాయి. పక్షి మెదడులోని ఒక భాగం నిద్రలో చురుకుగా ఉండే విధంగా నియంత్రిస్తుంది. మెదడు చురుకుగా ఉంటే ఒక కన్ను తెరిచి ఉంటుంది.
అంటే ఒకవైపు కన్ను చురుగ్గా ఉంటుంది,మరోవైపు నిద్రపోతుంది.ఈ విధమైన నిద్ర సామర్థ్యం కారణంగా, పక్షి నిద్రపోతున్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదం నుంచి తనను తాను రక్షించుకోగలదు. నిద్రపోతున్నప్పుడు చెట్టు మీద నుంచి పడకపోవడానికి ఒక ప్రధాన కారణం కూడా ఇదే.మరొక కారణం ఏంటంటే..పక్షుల పాదాల ఆకృతి. పక్షుల పాదాల నిర్మాణం ఒక వస్తువును గట్టిగా పట్టుకోగలిగేలా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు, వాటి పాదాల వేళ్లు చెట్టు కొమ్మలను గట్టిగా బిగించి, తాళం వేసినట్టు పట్టుకుంటాయి. అందుకే నిద్ర సమయంలో కూడా పక్షులు చెట్టుపై నుంచి కింద పడవు.
What's Your Reaction?