కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం

లింగాపురం స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 24, 2023 - 17:24
 0  28
కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం

కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం...

సమస్యల పరిష్కారం కోసమే మన పోరాటం...

సల్కాపురం,లింగాపురం,తుమ్మలపల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న...

అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్....

గొంగళ్ల రంజిత్ కుమార్ కి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు...

జోగులాంబ గద్వాల జిల్లా:

గట్టు మండలంలోని సల్కాపురం,లింగాపురం,తుమ్మలపల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.....

నడిగడ్డ ప్రజల కష్టాలు తీరాలంటే గద్వాల కోట పైన బహుజన జెండా ఎగురవేయాలని,భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన అమూల్యమైన ఓటు గద్వాల అభివృద్ధి కోసం నీతి నిజాయితీ నిక్కచ్చితో పోరాడుతున్న నిజమైన బహుజన నాయకుడికి సింహం గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు.ఆత్మగౌరవం,విద్య,వైద్యం అభివృద్ధి సంక్షేమం కోసం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఒక్కసారి అవకాశం ఇస్తే గద్వాల కోటపైన బహుజన జండా ఎగురవేసి నడిగడ్డలో సుపరిపాలన అందిస్తానని ఈ సందర్భంగా అయన తెలిపారు.

70 సంవత్సరాల నుండి ఒకే కుటుంబానికి అధికారం ఇచ్చినకానీ బంగ్లా పాలకులు ఏమాత్రం కూడా గద్వాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నోచుకోలేదు. కావున వచ్చే ఎన్నికల్లో బంగ్లా కుటుంబాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.కావున రాబోయే రోజుల్లో మహనీయుడు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఇచ్చిన ఓటుఅనే బలమైన ఆయుధంతో ప్రజలే బంగ్లా పాలకులకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.నడిగడ్డ మార్పు కోసం నడిగడ్డ ప్రజల ఆకాంక్ష కోసం,విద్య,వైద్యం,అభివృద్ధి, సంక్షేమం కావాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమని కావున రాబోయే ఎన్నికల్లో బరిలో నిలబడి గద్వాల కోటపైన బహుజన జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా నడిగడ్డ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి సింహం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,జిల్లా కార్యదర్శి లవన్న,జిల్లా నాయకులు రంగస్వామి,పరశురాముడు,అవనిశ్రీ,వెంకట్రాములు గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు,ఉపాధ్యక్షుడు దయాకర్,కార్యదర్శి నరేష్ మరియు ఆయా మండల,గ్రామ నాయకులు కార్యకర్తలు,గ్రామస్తులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow