రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్

రష్యా స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 24, 2023 - 22:55
 0  67
రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్

రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్.. 16 డ్రోన్లు కూల్చివేత

దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, గత రాత్రి ఉక్రెయిన్ రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది.రష్యా రక్షణ వ్యవస్థలు క్రిమియాపై 16 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేశాయి.ఉక్రెయిన్ దళాలు ఇప్పటికీ రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్నాయి.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దక్షిణాన ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ యూనిట్లపై తమ బలగాలు దాడి చేశాయని తెలిపింది.

రష్యన్ దళాలు కీవ్‌ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం విఫలమైనప్పటి నుంచి తూర్పు వైపు దృష్టి సారించాయి.అక్కడ ఉక్రెయిన్ భూభాగంలో 20శాతం కంటే కొంచెం తక్కువగా ఉంటారు.దీంతో దక్షిణ ఖెర్సన్ ప్రాంతంలోని బెరిస్లావ్ పట్టణంపై రష్యా దళాలు దాడి చేయడంతో నలుగురు మరణించారు.జూన్‌లో ప్రారంభించిన ప్రతీకార దాడిలో భాగంగా ఉక్రెయిన్ ద్వీపకల్పంతో పాటు చుట్టుపక్కల ఉన్న రష్యన్ సైనిక లక్ష్యాలపై డ్రోన్,క్షిపణిలతో దాడులను వేగవంతం చేసింది.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ..

ఇక,క్రిమియా ద్వీపకల్పంలో గాలిలో 16 ఉక్రెయిన్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారులు ఇవాళ తెలిపారు.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ..గురువారం రాత్రి ఏరియల్ డ్రోన్‌ లను ఉపయోగించి రష్యా భూభాగంపై దాడి చేయడానికి కుట్ర చేశారు.అయితే ఉక్రెయిన్ ఈ ప్రయత్నాన్ని తాము తిప్పికొట్టామని ఆయన చెప్పారు.13 డ్రోన్లు క్రిమియన్ ద్వీపకల్పంపై దాడి చేయబోయయి.మూడు వోల్గోగ్రాడ్ ప్రాంతం వైపు వెళ్లాయి.వాటిని మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు.అయితే, రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది.ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుంది.రష్యా నల్ల సముద్రం నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో మోహరించినందున ఉక్రెయిన్ కూడా ఈ ప్రాంతంపై దాడి చేస్తుంది.ఈ ప్రాంతం ద్వారానే రష్యా తన సైన్యానికి ఆయుధాలను సరఫరా చేస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow