గర్భవతి మహిళలు కు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

శింగనమల స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 10, 2024 - 06:33
 0  34
గర్భవతి మహిళలు కు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

గర్భవతి మహిళలు కు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

శింగనమల నియోజకవర్గము :

బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తనిఖీ చేశారు. 

ప్రతి నెల 9వ తేదీన ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద గర్భిణీ స్త్రీలకు అందించే భోజన పథకాన్ని గత ప్రభుత్వం నిలిపివేయడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే స్వచ్ఛందంగా పసుపుల బ్రదర్స్ వారి సహకారంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ బుక్క రాయసముద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు భోజనం వసతి తిరిగి ప్రారంభించారు.గర్భిణీ స్త్రీలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.ఆసుపత్రిలో కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా ఆస్పత్రిలోని ఖాళీ స్థలాలను పరిశీలించి కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కు వైద్యసేవలు అందించే విషయంలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి,ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు.రోగులకు వైద్యం అందించే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని ఆసుపత్రిలోని వైద్యులను,అధికారులను కోరారు.

హాట్ న్యూస్ ని చదవండి:- ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు - https://studiobharat.com/Grand-birthday-celebrations-of-Sonia-Gandhi

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow