తుడుం దెబ్బ ను రద్దు చేసే అధికారం రాష్ట్ర కమిటీదే
ఇంద్రవెల్లి స్టూడియో భారత్ ప్రతినిధి

తుడుం దెబ్బ కమిటీలను రద్దు చేసే అధికారం రాష్ట్ర కమిటీకే ఉంది
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు జాతి నాయకులే తుడుం దెబ్బను విచ్చినం చేసే కుట్ర చేస్తున్నారు
రాయిసెంటర్ సార్మెడి,పటేల్ల వ్యవస్థను గౌరవిస్తాం
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్
ఇంద్రవెల్లి :
ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తుడుం దెబ్బ కమిటీలను రద్దు చేసే అధికారం రాష్ట్ర కమిటీ సభ్యులకు మాత్రమే ఉంటుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద ఆదివాసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
కొందరు జాతి నాయకులే స్వార్థ రాజకీయ లబ్ధి కోసం తుడుం దెబ్బను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాయి సెంటర్ సార్మేడిలను పటేల్లను కొడప నగేష్ తప్పుద్రోవ పట్టించడం జరిగిందని తెలిపారు.ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలిగించే విషయంపై సమావేశం ఏర్పాటు చేసి ఎవరికి తెలవకుండా కమిటీలను రద్దు చేసి,తుడుం దెబ్బ మళ్ళీ తనవశం చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా కొడప నగేష్ ఈ తీర్మానం చేశారని ఆయనకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.రాయిసెంటర్ సార్మేడి,పటేల్ వ్యవస్థను గౌరవిస్తామని పేర్కొన్నారు.కొడప నగేష్ పై తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో త్వరలో ప్రెస్ మీట్ నిర్వహిస్తామన్నారు.
ఇది కూడా చదవండి..https://studiobharat.com/Even-if-the-plane-sinks-the-passengers-are-safe.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
ఎవరైనా జాతినీ,తుడుం దెబ్బను విచ్చిన్నం చేసే కుట్ర చేస్తే ఊరుకోమన్నారు.తుడుం దెబ్బ జిల్లా,మండల కమిటీలు యధావిదిగా కొనసాగుతాయని తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ గ్రౌండ్లో తుడుం దెబ్బ అధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తలపెట్టడం జరిగింది.కావున రాష్ట్ర నలుమూలల నుండి ప్రజాస్వామికవాదులు,ఆదివాసీ సంఘాల నాయకులు,విద్యార్థులు,మేధావులు కార్మికులు,కర్షకులు పెద్ద ఎత్తున తరిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు,మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక,ప్రధాన కార్యదర్శి పేందూర్ పుష్పరాణి,ఉపాధ్యక్షురాలు ఇందిరా,జిల్లా నాయకులు శ్యాంరావు,వెట్టి మనోజ్,విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు సలాం వరుణ్,మండల అధ్యక్షుడు జుగ్నక్ భారత్,విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పుర్క చిత్రు,మండల ఉపాధ్యక్షుడు గేడం భారత్,అంధ్ ఆదివాసీ సంఘం జిల్లా నాయకులు ముఖాడే విష్ణు,కొలం సంఘం మండల నాయకులు చాహాకటి మానిక్ రావు,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






