ప్రారంభోత్సవానికి ముస్తాబయిన్న చిల్లకల్లు ఫోర్ లైన్ రోడ్డు 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 1, 2023 - 18:06
 0  116
ప్రారంభోత్సవానికి ముస్తాబయిన్న చిల్లకల్లు ఫోర్ లైన్ రోడ్డు 

ప్రారంభోత్సవానికి ముస్తాబయిన్న చిల్లకల్లు ఫోర్ లైన్ రోడ్డు 

జగ్గయ్యపేట

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి రోడ్ల అభివృద్ధి లో భాగంగా జగ్గయ్యపేట పట్టణ ప్రాంతం నుండి చిల్లకల్లు వరకు అనగా 1.2 కిలోమీటర్ నుండి సుమారు 14.5 కిలోమీటర్ల దూరం మేర 14 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను కృషితో ఫోర్ లైన్స్ రోడ్డుని ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ది:02/08/23 బుధవారం నాడు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి,రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా),యన్.టి.ఆర్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీమతి తానేటి వనిత లు పాల్గొంటున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి లో ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళుతున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు.ఇప్పటికే జగ్గయ్యపేట ప్రాంతంలో వాహనదారుల సౌకర్యార్థం ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను పట్టుదల దీక్ష తో ఫోర్ లైన్స్ రోడ్డులను,డబల్ రోడ్డులను వైకాపా పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి సుమారు 75 కిలోమీటర్ల మేర 35 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో రోడ్లను శరవేగంగా విస్తరింపజేయడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/The-authority-to-cancel-slapping-is-the-state-committee.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.

ఇదే కాకుండా గ్రామలలోకి సైతం తారు రోడ్డు విస్తరించడానికి ఏర్పాటు కోసం సుమారు 17 కిలోమీటర్ల మేర 5 కోట్ల 50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను కేటాయించి,తారు రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉందనేది తెలుస్తుంది.ఇదేకాకుండా జగ్గయ్యపేట నుండి షేర్ మహమ్మద్ పేట హైవే వరకు కూడా ఫోర్ లైన్స్ కోసం సుమారు 6 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.ఇప్పటికే పట్టణ శివారు ప్రాంతమైన పద్మావతి నగర్ జంక్షన్ గా ఏర్పాటు చేయడం వల్ల జగ్గయ్యపేట పట్టణం మరింత సుందరీకరణగా మారింది.ఇప్పటికే ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను కృషితో పట్టణ అభివృద్ధిలో భాగంగా చిల్లకల్లు ఫోర్ లైన్స్ రోడ్డు ఏర్పాటు తో జగ్గయ్యపేట పట్టణానికి మరింత వన్నె తెచ్చిందని ప్రజలు సంతోషాని వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow