శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఒక్క ఛానల్ ఇంటర్వ్యూలో తనపై మాట్లాడింది అవాస్తవాలు,పచ్చి అబద్ధాలు - బొల్లా రామకృష్ణ

పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 29, 2024 - 08:26
 0  742
శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఒక్క ఛానల్ ఇంటర్వ్యూలో తనపై మాట్లాడింది అవాస్తవాలు,పచ్చి అబద్ధాలు - బొల్లా రామకృష్ణ

శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఒక్క ఛానల్ ఇంటర్వ్యూలో తనపై మాట్లాడింది అవాస్తవాలు,పచ్చి అబద్ధాలు - బొల్లా రామకృష్ణ

పెనుగంచిప్రోలు

యన్.టి.ఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో గల నూతలపాటి ఫంక్షన్ హాల్ లో తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి,ప్రముఖ వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం జాతీయ కోశాధికారి,మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం తెదేపా పార్టీ యంయల్ఏ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఒక్క ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో తన పై పలు అవాస్తవ ఆరోపణలు చేసినట్లు తెలియజేశారు.వాటిని పండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు.

శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గారు తనపై వైయస్సార్ పార్టీ నుండి తెలుగు దేశం పార్టీ లోకి రావడం జరిగిందన్ని,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారని,పార్టీలో ఉంటే ఉంటాడు పోతే పోతాడని తనని,తన సామాజిక వర్గాని గురించి మాట్లాడటం పచ్చి అబద్దమని పత్రికా ముఖంగా ఆయన ఖండించారు.

తను పదిహేను సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నానని లాక్ డౌన్ సందర్భంగా మాత్రమే తాళ్లూరు గ్రామ తన తల్లి సర్పంచ్ గాను,తన తండ్రి యంపిటిసి గా తెలుగు దేశం వైపు పోటి చేసి గెలవడం జరిగిందని,దానితో తను,తన కుటుంబం మొత్తం స్థానిక అధికార పార్టీ నుండి కేసులు పెట్టించుకోవడంతో పాటు జైలుకు సైతం వెళటమే కాకుండా,అడుగడుగునా ఇబ్బందులు పడానని ఈ విషయం పార్టీలో అందరికి తెలుసునని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అయినప్పటికి తను గ్రామంలో ఉండి వ్యాపారలకు దూరంగా ఉండి చక్కదిద్దుకున్నన్నారు.

తదిపరి హైదరాబాద్ లో ఉన్న తనని శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మరియు వారి సోదరులు ఫోన్ చేసి మున్సిపల్ ఎన్నికలలో తెదేపా పార్టీ తరుపున వచ్చి ప్రచారం చేయాలని కోరగా,ఎంతో ప్రేమని వలకబోసి తనతో లక్షల రూపాయలను పార్టీ కోసం ఖర్చు చేయించి,కనీసం అధిష్టానానికి చెప్పటానికి కూడా వారు ఇష్టపడలేదన విషయాలను ఆయన గుర్తు చేశారు.వైకాపా పార్టీ అధికార యంయల్ఏ ఉన్న కేసులను మరలా రీ ఓపెన్ చేయించింది,మరియు బస్టాండ్ లో వైకాపా యంయల్ఏ తండ్రి గారి విగ్రహాని తొలగించాలని కేసులు వేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసునని ఆయన అన్నారు.

గ్రామాలలో తను,తన లాంటి సామాజిక తరగతికి చెందిన కార్యకర్తలు అధికార వైకాపా నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదురుకుంటూ కేసులను తెలుగు దేశం పార్టీ కోసం పెట్టించుకుంటున్నామని ఆయన తెలియజేశారు.తనకు ,తన సామాజిక వర్గానికి ఎటువంటి దొంగ వ్యాపారాలు గాని, కర్మాగారాలలో సిక్సిటీ ఫార్టీ వ్యాపారాలు గాని లేవని,అధికార పార్టీ తో కుమ్మక్కు కాలేదని ఆయన ఆవేదన వెళ్ళబుచ్చారు.ఇప్పటికైన తన పై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

అటువంటి తనపై శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అగౌరవంగా మాట్లాడటం సరికాదని,దీనిని తీవ్రంగా ఆయన ఖండించారు.పార్టీ గెలుపు కోసం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోతుంటే,ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని,ఇదే పరిస్థితులు కొనసాగితే తను జగ్గయ్యపేట నియోజకవర్గంలో తనకి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వల్ల జరిగిన అన్యాయాన్ని గడపడానికి వెళ్లి తెలియజేస్తానని ఆయన పత్రికా ముఖంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీ,శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవ్,సీనియర్ న్యాయవాది సామినేని వెంకటేశ్వరరావు,టిడిపి సమన్వయకర్త వైవిఎస్ రెడ్డి,శివాపురం సర్పంచ్ తెళ్ల లక్ష్మణరావు,జొన్నలగడ్డ సర్పంచ్ లగడపాటి బాబి,గుమ్మడిదూరు మాజీ సర్పంచ్ పొన్నంరంగా,ముళ్లపాడు సర్పంచ్ ఉమ్మినేని పుల్లారావు,కంభంపాడు ఎంపీటీసీ శాంతి బాబు,శివపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు చెరుకూరి జనార్దన్ రావు,కంభంపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు చేకూరి రమేష్, చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు రావూరి విశ్వనాథం,తాళ్ళూరు మాజీ ఉపసర్పంచ్ షేక్ సొందు మియ,చెరుకుపల్లి శివరాం ప్రసాద్,లాయర్ నరసరాజు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow