ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు

కొత్తపల్లె స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 5, 2024 - 01:53
 0  101
ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు

రాయచోటిలో ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు

తరగతి గదిలోనే జరిగిన ఈ దారుణం

కొత్తపల్లె 

రాయచోటిలోని కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి పై తొమ్మిదవతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరగతి గదిలోనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వల్ల ఉపాద్యాయుడు మృతి చెందినట్లు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

విద్యార్థుల మద్య జరుగుతున్న ఘర్షణ ఆపిన ఉపాధ్యాయుడు. ఇద్దరు అన్నదమ్ములు మరొక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని అడ్డుకున్న ఉపాధ్యాయుడు దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పై ఆ ముగ్గురు పిడిగుద్దులతో చెస్ట్ మీద , ముఖం మీద దాడికి పాల్పడటంతో కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు.

వెంటనే ఆసుపత్రిలో చేర్చిన తోటి ఉపాధ్యాయులు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన హృదయ విషాదకర, విచారకరమైన ఈ సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఉపాధ్యాయ సమాజం విశ్లేసించుకోవాలి.

ఎటు పోతోంది నేటి యువత!

హాట్ న్యూస్ ని చదవండి:- నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు చెక్ పెట్టిన జగ్గయ్యపేట పోలీసు - https://studiobharat.com/Jaggayyapet-police-checked-vehicles-without-number-plates

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow