యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పొదలకూరు స్టూడియో భారత్ ప్రతినిధి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
డ్రగ్స్‌కు బానిస కావొద్దు, భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
పొదలకూరు సీ.ఐ సంగమేశ్వర రావు, ఎస్.ఐ కరిముల్లా
డ్రగ్స్ వాడకం–దుష్పరిణామాల’పై అవగాహన సదస్సు , ప్రతిజ్ఞ
పొదలకూరు :
మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని స్థానిక సీ.ఐ సంగమేశ్వర రావు,ఎస్.ఐ కరిముల్లా అన్నారు.పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వాడకం–దుష్పరిణామలపై సోమవారం 'ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ సందర్భంగా అవాహన కల్పించి,అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనమన్నారు.దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత,విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు.
What's Your Reaction?