మంచిర్యాలలో ప్రారంభమైన బీసీ చైతన్య యాత్ర
మంచిర్యాల స్టూడియో భారత్ ప్రతినిధి
బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తాం!
మంచిర్యాలలో ప్రారంభమైన బీసీ చైతన్య యాత్ర
మంచిర్యాల
దేశంలో మెజారిటీ వర్గమైన బీసీల న్యాయమైన హక్కుల విషయంలో రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఆదివారం రోజున మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభమైన బీసీ చైతన్య యాత్ర ను ఉద్దేశించి ఆయా సంఘాల నాయకులు ప్రసంగించారు.చైతన్య యాత్రను సీనియర్ బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్య జెండా ఊపి ప్రారంభించారు.బీసీ బిడ్డల న్యాయమైన హక్కులను నిలబెట్టే వారినే రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలు గెలిపిస్తారని వారు తెలిపారు. బీసీలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బీసీ జనగణనని జాతీయస్థాయిలో చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ దేశంలో కుక్కలు,కోళ్లు,మేకలకి లెక్కలు ఉంటాయి కానీ..
బీసీల లెక్కలు తీయడంలో రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నించారు.మెజార్టీ వర్గమైన బీసీల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు..అగ్రవర్ణాలకు అనుకూలమైన మనువాద ఎజెండానే అమలు చేస్తున్నారని వారు విమర్శించారు. బీసీ హితం కోరుకునే వారికే దేశాన్ని పాలించే హక్కు ఉన్నదని వారు హెచ్చరించారు.బీసీ జనగణన తో పాటు రిజర్వేషన్ల పెంపు చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లతో పాటు..అగ్రవర్ణ రిజర్వేషన్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.మెజార్టీ వర్గమైన బీసీ ప్రజల్లో చైతన్యం వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు.మహాత్మ ఫూలే అందించిన బహుజన చైతన్యాన్ని బీసీ ప్రజలు నేడు స్వీకరించాలని వారు కోరారు.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జరుగనున్న బీసీ చైతన్య యాత్రలో ప్రజలని చైతన్య పరుస్తామని వారు తెలిపారు. బీసీలకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఆయా రాజకీయ పార్టీల కపట వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారని వారు హెచ్చరించారు.ఐక్య ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని..బీసీ ఐక్యవేదిక అందుకు పాటు పడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్,సీనియర్ బీసీ నాయకులు కనుకుంట్ల మల్లయ్య,సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం,అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి,సింగరేణి ఐక్యవేదిక నాయకులు పెద్దపల్లి కోటిలింగం,పెరక సంఘం నాయకులు శంకరయ్య,బీసీ నాయకులు నీరటి రాజన్న,సోమయ్య,బి సి జిల్లా వైయస్ ప్రెసిడెంట్ దండె భూమన్న, వేముల మల్లేష్, ఆడపు గణేష్, చిందం వెంకటేష్, నస్పూరి అఖిల్,ఏదులాపురం రాజు,కొట్టె నటేశ్వర్,పద్మశాలి సంఘం నాయకులు చలమల్ల అంజయ్య,కోమటి రాజు,అడిచెర్ల రాజయ్య,ఇప్పలపల్లి దేవయ్య,వెంకటేశ్వర గౌడ్ కాన్పూర్ సర్పంచ్ ఆయుడప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?