శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా:
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని (Gold) కస్టమ్స్ అధికారులు (Customs Officers) పట్టుకున్నారు.జెడ్డా(Jeddah)నుంచి ఇద్దరు ప్రయాణికులు ఇండిగో విమానం (Indigo Flight) లో శంషాబాద్ (Shamshabad) కు వచ్చారు..
అధికారులు తనిఖీలు చేస్తుండగా వారి వద్ద రూ.కోటి విలువ చేసే అక్రమ బంగారం లభ్యమైంది.దీంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేసి..ఇద్దరినీ అరెస్టు చేశారు.
ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారం పట్టుకున్నారు.బంగారం తరలిస్తున్నారనే పక్క సమాచారంతో కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.నింధితుల వద్ద పట్టు బడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1.11 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నింధితులను విచారిస్తున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
What's Your Reaction?