నెల్లూరు వైకాపాలో వర్గపోరు
నెల్లూరు స్టూడియో భారత్ ప్రతినిధి
నెల్లూరు వైకాపాలో వర్గపోరు.. రూప్‌కుమార్‌కు ఎమ్మెల్యే అనిల్ కౌంటర్..
నెల్లూరు:
నెల్లూరు నగరంలో వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన ఓ సభలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...ఇటీవల డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ చేసిన బహిరంగ విమర్శలపై తీవ్రంగా స్పందించారు..
నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌ను ఉద్దేశించి విమర్శించారు.పార్టీ మారుతున్నాననే ప్రచారం మానుకోవాలన్నారు.నియోజకవర్గంలో కార్యకర్తలను బలోపేతం చేసి, మళ్లీ ఫైర్ బ్రాండ్‌లా మారి ఢీ కొంటానన్నారు.
''రాత్రిపూట పార్టీలో తాగి అనిల్‌ను ఓడిస్తామంటున్నారు. పగలు జై జగన్ అంటున్నారు. నాకు సినిమా చూపిస్తానని ఒకరు బహిరంగంగా అంటున్నారు. నేను తయారు చేసిన బొమ్మ అనిల్ అని చెబుతున్నారు. దమ్ముంటే సినిమా చూపించాలి. లే అవుట్ల వద్ద నేను డబ్బులు తీసుకోలేదు. రేపటి నుంచి స్టార్ట్. ఎవరికీ భయపడను. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైకాపా నుంచి నేను తప్ప ఎవరూ పోటీ చేయరు'' అని అనిల్ వెల్లడించారు..
What's Your Reaction?