అంతర్రాష్ట్ర ఆవుల దొంగలు అరెస్ట్
రేణిగుంట స్టూడియో భారత్ ప్రతినిధి

9 మంది అంతర్రాష్ట్ర ఆవుల దొంగలు అరెస్ట్
రేణిగుంట :
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో,రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు మార్గదర్శకతన రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి నేతృత్వంలో గాజులమండ్యం ఎస్సై టీవీ సుధాకర్ తన సిబ్బందితో గాజులమండ్యం పంచాయతీ ఆయిల్ ఫ్యాక్టరీ కూడలి వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక బొలెరో వాహనంలో ఆవులను రవాణా చేస్తూ కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిని విచారించగా హర్యానా రాష్ట్రానికి చెందిన 8 మంది,తమిళనాడు ఊతుకోటకు చెందిన కబుర్ భాష అనే వ్యక్తిగా వెల్లడైంది. ఈ తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
What's Your Reaction?






