గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి

భద్రాచలం స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 21, 2023 - 14:43
 0  23
గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి

గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి..

భద్రాచలం:

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా..

పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/Pay-link-for-devotees-who-got-service-tickets-in-Lucky-Dip.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ సూచిస్తున్నారు.సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.తూర్పుగోదావరి గంటగంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.80 అడుగులకు చేరుకుంది. 175 గేట్లను అధికారులు ఇప్పటికే ఎత్తివేశారు.8.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహిస్తోంది.మరోవైపు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow