మావోయిస్టుల బంద్ తో హై అలర్ట్
ములుగు స్టూడియో భారత్ ప్రతినిధి
మావోయిస్టుల బంద్ తో హై అలర్ట్
ములుగు:
మావోయిస్టులు సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాల, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీసులు పలు వాహనాలు, లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.
హాట్ న్యూస్ ని చదవండి:- టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.?? - https://studiobharat.com/Doctors-shorten-life-by-watching-TV
What's Your Reaction?