పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన పెరగని ప్రధాన రోడ్ల విస్తరణ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన పెరగని ప్రధాన రోడ్ల విస్తరణ....
ఇరుకు రోడ్లు అవ్వడంతో ఇష్ట పడని వినియోగదారులు
వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్న వ్యాపార వర్గాలు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణ ప్రాంతం ముక్త్యాల నుండి బస్టాండు వైపు ప్రధాన రోడ్డు పెరుగుతున్న జనాభా అనుగుణంగా విస్తరించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనితో ద్విచక్ర,మూడు,నాలుగు చక్రాల వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు.జగ్గయ్యపేట పట్టణ ప్రాంతం ప్రధానంగా నాణ్యమైన బంగారు ఆభరణాల అమ్మకాలకు పెట్టింది పేరు.పాత కాలంలో పదిహేను వేల జనాభా ఉన్నప్పుడు ఇన్ని ఇంధన వాహనాలు లేకపోవడంతో ఆ రోజులలో వ్యాపార కూడలి ప్రధాన రోడ్డు అందరికి సరిపోయేలా ఉంది.ప్రస్తుతం జనాభా సుమారు 60 వేలు పైబడి ఉండటం వాహనాల సంఖ్య పెరగడంతో గతంలో రోడ్ల విస్తరణ కొంత మేర జరగడంతో,ఆ విస్తరణ జనాభా ప్రాతిపదికన రోడ్డు విస్తరణ లేకపోవడంతో ప్రజలకి అసౌకర్యం కలగడమే కాకుండా,వ్యాపారాలు సైతం సరిగా లేకపోవడం తో వ్యాపారస్తులు దివాలా తీస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి విషయాల పై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉన్నప్పటికి పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన వ్యాపార కూడలిలో ప్రధాన రోడ్ల విస్తరణ,వాహనాల పార్కింగ్ ఏవిధంగా ఉండాలనే అభిప్రాయాని వ్యాపార వర్గాలు,ప్రజలలో అవగాహన కల్పించి తద్వారా జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూ వ్యాపారాలను పెంచే ఆలోచన దిశగా ఎందుకు చేయడం లేదోననేది ప్రశ్నలుగా తలెత్తు తున్నాయి.
హాట్ న్యూస్ ని చదవండి:- మావోయిస్టుల బంద్ తో హై అలర్ట్ - https://studiobharat.com/High-alert-with-Maoist-bandh
ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపాలిటీలు,గ్రేటర్ మున్సిపాలిటీలు పట్టణాలలో పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన రోడ్లను ఏవిధంగా విస్తరించాలి,వాహనాల పార్కింగ్ ఎలా ఏర్పాటు చేయాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళుతున్నాయి.జిల్లాలో అన్ని మున్సిపాలిటీల కన్న ముందే జగ్గయ్యపేట పట్టణ మున్సిపాలిటీగా ఏర్పాడిందని తెలుస్తోంది.కాని కొత్తగా ఏర్పడుతున్న మున్సిపాలిటీ అభివృద్ధి కన్న జగ్గయ్యపేట పట్టణ రోడ్ల అభివృద్ధిలో ఆమడ దూరంలో వెనుకబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇటువంటి విషయాలను మరియు ముక్త్యాల మాదిపాడు కృష్ణా నది పై హైవే బ్రిడ్జి ఏర్పాటు చేయబోతున్న మరియు భవిష్యత్తు తరాలను,పెరుగుతున్న జనాభా,వాహనాలను దృష్టిలో పెట్టుకొని జగ్గయ్యపేట పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల విస్తరణను మరియు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేపట్టే ఆలోచన చేయాలని,తద్వారా వ్యాపార అభివృద్ధి,ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుందని దీని పై ప్రభుత్వ,మున్సిపాలిటీ పెద్దలు మరియు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని పలువురు మేధావులు తెలియజేసారు.
What's Your Reaction?