BRS నుండి కాంగ్రెస్ లోకి వలసలు
సంగెం స్టూడియో భారత్ ప్రతినిధి
తుంగతుర్తి మండలం సంగెం గ్రామం నుండి BRS నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు
తుంగతుర్తి మండలం సంగెం గ్రామం నుండి BRS నాయకులు జటంగి సైదులు,జటంగి వెంకన్న,కలకొట్ల దానయ్య, జటంగి అప్పయ్య, జటంగి నాగయ్య,జటంగి సోమయ్య,పానగంటి బాబు, ఎల్పుగొండ మధు, పానాగంటి ఫిరయ్య,ఇరుగు సైదులు, గునుగంటి సరిన్,జోగునురి వెంకన్న తో పాటు 100 మంది కి పైగా అధికార BRS పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరడం జరిగింది.వారికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానిచడం జరిగింది.తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వస్తుంది.అని పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు.మండల పార్టీ అధ్యక్షుడు దోంగరి గోవర్ధన్ వారిని సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గుడిపాటి నర్సయ్య,జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు పాల్గొన్నారు.
What's Your Reaction?