ప్రభుత్వాలే శ్రమ దోపిడికి మహిళలను గురి చేస్తుంది
స్టూడియో భారత్ ప్రతినిధి

ప్రభుత్వాలే శ్రమ దోపిడికి మహిళలను గురి చేస్తుంది .... సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట
దేశ వ్యాప్తంగా మహిళలను గౌరవించేలా ప్రతి యేటా మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సంతోషంగా ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది.అన్ని రంగాలలో మహిళలు ముందు పీఠాన నిలబడటం సంతోషించ దగ్గ విషయమే.ప్రైవేటు రంగమైన సాఫ్ట్ వేర్ లో మహిళలకు వేతనాలు బాగున్నాయనే చెప్పుకోవచ్చు.కాని ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్,స్కీం వర్కర్లు,టైం స్కేల్ అంటూ ముద్దు పేరు పెట్టి మహిళలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాని సైతం ఇవ్వడం లేదని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.దేశంలో సగటు కుటుంబాల ఖర్చులు సుమారు 24,000 రూపాయల కు నెలవారీ పెరగడంతో,ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న పై తెలిపిన మహిళా కార్మికులకు సుమారు 8000 నుండి 12,000 రూపాయల వేతనాలు ఇవ్వడం బాధాకరమని అన్నారు.
జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ. - https://studiobharat.com/CM-Revanth-meets-Jana-Reddy
మహిళలకు కుటుంబ భాధ్యతలు ఉన్నప్పటికీ కొన్ని శాఖలలో మహిళలను సుమారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 , 7 గంటల సమయాన్ని వరకు పనిచేస్తూ మహిళలను శ్రమ దోపిడి కి గురి చేస్తూ,వారి మానసిక ఒత్తిడి కి ప్రభుత్వమే కారణం అవుతుందని ఆయన అన్నారు.మహిళా దినోత్సవం రోజే మహిళలను గౌరవిస్తూ ఏ ప్రభుత్వమైన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది.ఇప్పటికైన మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని శాఖలలో పనిచేస్తున్న వారికి కనీస వేతనం 24,000 రూ అందించి,ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిని కల్పించి వారికి మానసిక ఒత్తిడిని తగ్గించాలని,పనిలో భద్రతను కల్పించాలని,అదనపు యాప్ లు,ఆన్ లైన్ వర్క్ లను ప్రభుత్వం తగ్గించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం వారి పనిలో కూడా అటువంటి విధానాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు.
What's Your Reaction?






