ఆరోగ్య సమస్యల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - డాక్టర్ విక్రమ్ వెంకట్
విశ్లేషణ స్టూడియో భారత్ ప్రతినిధి
ఆరోగ్య సమస్యల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - డాక్టర్ విక్రమ్ వెంకట్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణం స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్స్ డే పురస్కరించుకుని ఆరోగ్య సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ సిఇఒ మరియు యండి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ విక్రమ్ వెంకట్ పాత్రికేయ సమావేశంలో అన్నారు.డాక్టర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశం లో 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ప్రతి వంద మందిలో సుమారు 20 మందికి హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని ఆయన అన్నారు.హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలను చెప్పుకోవచ్చని అన్నారు.వాటిలో జన్యుపరంగాను,మందు,సిగ్గరేటు త్రాగడం మూలానా,టెన్షన్ సమస్యలు,పొట్ట పెరగడం లాంటి వాటి వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ అని ఆయన అన్నారు.
గతంలో రక్తనాళాలు పూర్తిగా మూసుకొని పోతే ఈ సమస్య తలెత్తేదని, ప్రస్తుతం మనం తిన్నే ఆహారపు అలవాట్ల వల్ల రక్తనాళాలు యాభై శాతం లోపు మూసుకుని పోయిన కూడా ప్రస్తుత పరిస్థితుల్లో హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని అన్నారు.రాత్రి పూట వచ్చే ఛాతీ నొప్పిని అశ్రద్ధ చేయకుండా దగ్గర లో ఉన్న డాక్టర్ ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.హార్ట్ ఎటాక్ లు రాకుండా మంచి ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలని, ముఖ్యంగా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు,చేపలు,గుడ్డు లాంటి ఆహారాన్ని తినాలని, నివసించే ప్రాంతంలో గాలి,వెలుతురు ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు.
ప్రతి రోజు నడకని అలవరుచుకోవాలని ఆయన అన్నారు.గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైన అనిపిస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉన్న డాక్టర్ ని సంప్రదించాలని ఆయన అన్నారు.ప్రతి నలభై ఏళ్ల వయసు పైబడిన వారు ఖచ్చితంగా షుగర్, గుండె, కొలెస్ట్రాల్, కిడ్నీ పరీక్షలను ప్రతి ఆరు నెలలకొక్కసారైన చేయించుకోవాలని,ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యమే డాక్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన డాక్టర్స్ డే సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ దాచేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
What's Your Reaction?