ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏవిధంగా యువతను ఆకర్షిస్తున్నారో తెలుసా!

స్టూడియో భారత్ ప్రతినిధి

May 8, 2024 - 13:55
 0  81
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏవిధంగా యువతను ఆకర్షిస్తున్నారో తెలుసా!

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏవిధంగా యువతను ఆకర్షిస్తున్నారో తెలుసా!

ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రధానంగా కొత్తగా ఓటు వచ్చిన వారిని మరియు యువతను నాయకులు ఆకర్షించేందుకు వివిధ తాయిళాలతో కుస్తీలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు.

జగ్గయ్యపేట ప్రాంతంలో ఇప్పటి వరకు అభ్యర్థుల గెలుపు కోసం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు,సభలు, కండువాలను కప్పటం వరకు చూస్తే అర్థం అవుతుంది.యువత ఆలోచిస్తే... వారిని మేలుకొలుపటం కోసం యువతను పదండి ముందుకు పదండి అంటూ మంచి సమాజ నిర్మాణ కోసం నవ సమాజ మార్పు జరుగుతుందని శ్రీశ్రీ లాంటి మహానుభావులు వారి కలం నుండి జాలు వారిన సంగతి అందరికి తెలిసిందే.

కాని అటు దిశగా యువతను ఆలోచింప చేయకుండా వారిని మద్యం మరియు వివిధ రూపాల మత్తులలో ముంచుతూ, నాయకులు వారి వారి ర్యాలీలో బైక్ లు, వాహనాలను క్రమశిక్షణతో కాకుండా ప్రజలకు అసౌకర్యానికి కలిగించేలా చేస్తున్నారని,బైక్ లకు సైలెన్సర్స్ లను తొలగించి రైడింగ్ తో ప్రజలు విసుగు చెందుతున్నారు.

ప్రతిసారీ ఇటువంటి తీరు వల్ల ఎవ్వరో ఒక్క యువతకు ప్రమాదాలు జరుగుతుంటున్నాయని,దీనితో అటువంటి యువత తల్లిదండ్రులు ఆరోజును వారి జీవితంలో చీకటి రోజు గా రోదిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలు అసౌకర్యానికి కలిగించకుండా ఎన్నికల ప్రచారాలు జరగాలి మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఒక్క ప్రత్యేకతను ఎన్నికల శాఖ సంతరించుకుందనే చెప్పుకోవాలి.

కాని దీనికి భిన్నంగా నాయకులు ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారనే వాదనలు ప్రజలు నుండి వినిపిస్తున్నాయి.యువతా మేలుకో...ఓటు అనేది మన హక్కు... తల్లిదండ్రులు,గురువుల మాటలు యువత జీవితంలో వెలుగులను ఇస్తుంది.నాయకుల గెలుపు కోసం మీ జీవితాలను పనంగా బెడితే ఒరిగిందేమీ లేదు.నాయకుల స్వార్థం కోసం ఓటును తాకట్టు పెట్టవద్దు... పవిత్రమైన మీ ఓటును ఆలోచించి వేయాలని మా మనవి...మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow