వైసీపీ సిపి పొలిటికల్ స్ట్రాటజీ

స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 2, 2023 - 17:50
 0  54
వైసీపీ సిపి పొలిటికల్ స్ట్రాటజీ

వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ

పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైసిపి

అసలు టిడిపిని పట్టించుకోకపోతేనే బెటర్ అంటున్న వైసిపి

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన లు పొత్తులతో వెళ్తాయని అందరూ భావించారు. దీంతో అధికార వైసీపీ నేతలు దమ్ముంటే టీడీపీ , జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలంటూ సవాల్ చేస్తున్నారు. టీడీపీకి సన్నిహితంగా ఉండటంతో పవన్ కళ్యాణ్‌ ని ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గడచిన కొంత కాలంగా అటు జనసేన ఇటు టీడీపీ 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాం అంటూ ఎవరికి వారే ప్రచారం చేస్తుండటంతో వైసీపీకి విమర్శించటానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. దీంతో వేరే దారిలేక పవన్ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై విమర్శించడం మొదలుపెట్టారు. 

వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ ..

మూడ్రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి నగదును విడుదల చేసిన సందర్భంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. కురుపాం సభలో జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారంపై విమర్శించారు. అయితే దీనికి జనసైనికులు కూడా అంతే ధీటుగా మీ తాతకు ఎన్ని పెళ్లిళ్లో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ ఖంగుతిన్నట్లైంది. 

జగన్ ఫోకస్ అంతా పవన్‌ పైనే..

అయితే రాష్ట్రంలో అధికార పార్టీ ఎప్పుడూ ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలు చేయడం, వారిని టార్గెట్‌గానే విమర్శలు గుప్పించడం జరుగుతుంది. కాని ఏపీలో మాత్రం వైసీపీ నేతల గురి అంతా పవన్ కల్యాణ్‌పై పెట్టినట్లుగా కనిపిస్తోంది. టీడీపీని అస్సలు పట్టించుకోని జగన్‌ తన ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ వైపు మళ్ళించడం ద్వారా టీడీపీ ఓట్లు చీల్చి అవి పవన్ వైపు మళ్ళేలా చేయొచ్చునని భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే తన గెలుపు మరింత సునాయాసం అవుతుందనేది జగన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది రాజకీయ విశ్లేషకులంటున్నారు. 

కాపు ఓట్లు కంటే బీసీ ఓట్లే కీలకం..

పవన్ కళ్యాణ్‌న్ని విమర్శించడం వల్ల కాపు ఓట్లు దూరమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లన్ని తమ పార్టీకి అండగా ఉంటాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. కాపు ఓట్లపై ఎక్కువ కాలం నమ్మకం పెట్టుకోలేమని బీసీలతో సరైన నాయకత్వం లేదు కాబట్టి ఇప్పట్లో వారి ఓట్లు చీలిపోయో అవకాశం ఉండదనేది జగన్ భావనగా కనిపిస్తోందట. అందుకనే పార్టీలో కాపు నాయకులకు సైతం ప్రాధాన్యత తగ్గిపోతోందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. 

పట్టించుకోకపోతేనే బెటర్..

అసలు టీడీపీని పట్టించుకోకపోవడం, విమర్శించడం మానేయడం వల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రచారం రాకుండా చేయవచ్చనేది కూడా జగన్ ఆలోచనలో భాగమేనని రాజకీయ విశ్లేషకుల భావన. ఓవరాల్‌గా టీడీపీ ఓటు బ్యాంక్ చీలి జనసేన వైపు వెళ్లినప్పటికి అది అంతిమంగా తమకే కలిసి వస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow