తెలంగాణ డిజిపికి ఫోన్ ఖమ్మం బయలుదేరిన రేవంత్..
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

తెలంగాణ డిజిపికి ఫోన్ చేసి...హుటాహుటిన ఖమ్మం బయలుదేరిన రేవంత్..
హైదరాబాద్ :
తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఖమ్మంకు బయలుదేరారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల చేరిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది..
ఈ సభకోసం భారీ జనసమీకరణ చేస్తుండగా పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్నారని రేవంత్ కు కొందరు కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే డిజిపితో మాట్లాడిన రేవంత్ హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరారు. పోలీసుల తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు..
What's Your Reaction?






