అవకతవకలకు పాల్పడిన సిఈఓ
కొమరోలు స్టూడియో భారత్ ప్రతినిధి
రూ.39 లక్షల అవకతవకలకు పాల్పడిన సిఈఓ
ప్రకాశం జిల్లా.. కొమరోలు,..
రైతుల వద్ద రికవరీ పేరుతో తీసుకున్న సొమ్ము సొంత ఖర్చులకు స్వాహా.
దిలీప్ కుమార్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
దిలీప్ కుమార్ వద్ద ఎవరైనా ఇంకా రైతులు మోసపోతే నేడు,రేపు సొసైటీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపిన అధికారులు.
కొమరోలు లోని వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సీఈఓ గా విధులు నిర్వహించిన ఆర్.దిలీప్ కుమార్ నిధులు దుర్వినియోగం,ఆర్థిక పరిపాలన పరమైన అవకతవకలకు పాల్పడినట్లుగా విచారణలో రుజువైనట్లుగా అసిస్టెంట్ రిజిస్టార్ కందుల వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/Key-Responsibilities-for-Rajini.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి..
40 మంది రైతులను విచారణ చేపట్టగా దిలీప్ కుమార్ అప్పు జమ చేసేందుకు రైతుల వద్ద నగదు తీసుకొని,బ్యాంక్ లో జమ చేయకుండా,మళ్లీ రైతులకు మంజూరు చేశారన్నారు.
రైతుల నుండి రికవరీ చేసిన సొమ్మును సొంత ఖర్చుల నిమిత్తం దిలీప్ కుమార్ వాడుకున్నట్లుగా తేల్చారు...!!
What's Your Reaction?