నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవు..

నెల్లూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 7, 2023 - 12:19
 0  159
నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవు..

ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవు..

నెల్లూరు:

ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt) కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్దభేరి చేపట్టామని,సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు..

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు (Nellore) వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని,నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చునని చెప్పారు.సోమశిల (Somashila),కండలేరు (Kandaleru) పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు.పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు.గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని,పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు..

ఇది కూడా చదవండి...దవఖనా లో ఒకే రోజు ఎంత మంది శిశువులు జ‌న‌నం తెలుసా..చదవండి..https://studiobharat.com/how-many-babies-are-born-in-the-same-day-in-the-hospital.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.

2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి కోసం ఒక విజన్‌తో ముందుకెళ్ళామని,ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీర్చిన తరువాతే చెన్నైకి నీరిస్తమని ఆనాడు ఎన్టీఆర్ (NTR) తేల్చి చెప్పారని చంద్రబాబు అన్నారు.రాయలసీమ నాలుగు జిల్లాలు,నెల్లూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి చేసింది టీడీపీయేనన్నారు.పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ నెల్లూరుకు నీళ్లు అందించామన్నారు.వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీలు తీసుకొస్తే మొత్తం 250 టీఎంసీ నీరు రాయలసీమ,నెల్లూరుకు ఇవ్వవచ్చునన్నారు.ఈ పనులకు టెండర్లు పిలిచామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow