క్రికెట్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది సిరిస్ కు ఏమిచ్చారో తెలుసా
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
క్రికెట్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది సిరిస్ కు ఏమిచ్చారో తెలుసా
క్రికెట్ మ్యాచ్ టోర్నీ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రతి మ్యాచ్ కి అందజేస్తారు.అదేవిధంగా మొత్తం సిరీస్ లో,మొత్తం టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందజేస్తారు.ఇటువంటి అవార్డు రూపంలో ప్లేయర్ కు నగదు చెక్,ఒక్క ట్రోఫీ,బైక్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను అందజేస్తారు.
ఈ కాలంలో కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ లో ప్రపంచ దేశాలలో గల స్టార్ ప్లేయర్స్ పాల్గొన్నారు.ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో సర్రే జాగ్వార్స్ వర్సెస్ మాంట్రియల్ టైగర్స్ మధ్య ఆట జరిగింది.ఈ మ్యాచ్ లో మాంట్రియల్ టైగర్స్ జట్టు విజయం సాధించింది.దీనితో పాటు టైటిల్‌ను సైతం కైవసం చేసుకుంది.
ఈ టోర్నీ లో అద్భుతంగా ఆటలో ప్రదర్శన కనపరచిన వెస్టిండీస్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ ప్లేయర్ ఆఫ్ ది సిరిస్ గా ఎంపికయ్యాడు.ఈ అవార్డుతో అతనికి నగదు,బైక్,కారు లాంటివి ఇవ్వలేదు.భూమి ఇచ్చారు.
ప్లేయర్ ఆఫ్ ది సిరిస్ గా షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ కు యునైటెడ్ ఆఫ్ అమెరికాలో అర ఎకరం భూమి లభించింది.రూథర్ ఫోర్డ్ అందుకున్న ఇటువంటి అవార్డు పై ప్రచార మాధ్యమాలలో చర్చ జరుగుతోంది.
ఆఖరి మ్యాచ్ లో షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ 29 బంతుల్లో 38 పరుగులతో దిగ్విజయంగా నిలిచాడరు.ఈ టోర్నీ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యారు.
ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్ ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసారు.సర్రే తరపున జతీంద్ర సింగ్ 57 బంతుల్లో 56 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు.131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మాంట్రియల్ టైగర్స్ ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించారు.ఆండ్రీ రస్సెల్ ఆరు బంతులు ఎదుర్కొంటూ ఇరవై పరుగుల తో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ లో రెండు సిక్సర్లు,ఒక్క ఫోర్ గా నిలిచింది.
What's Your Reaction?