వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై భారత్ ఘనవిజయం అరుదైన రికార్డు
క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... స్టూడియో భారత్ ప్రతినిధి

వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై భారత్ ఘనవిజయం అరుదైన రికార్డు
వరల్డ్ కప్ లో ఇండియా vs నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది.నెదర్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది.నెదర్లాండ్ బ్యాటర్లు కొంతమేర పోరాడినా చివరకంట భారత్ పై చెయ్యి సాదించింది.
భారత్ బ్యాటర్లు అదిరిపోయే పర్ ఫర్మెన్స్
మొదట భారత్ బ్యాటర్లు అదిరిపోయే పర్ ఫర్మెన్స్ ఇచ్చారు.రోహిత్ శర్మ,శుభమాన్ గిల్,విరాట్ కోహ్లీలు అర్థ సెంచరీ చేసి అవుట్ అయ్యారు.తరువాత బరిలోకి దిగిన శ్రేయస్,కెయల్ రాహుల్ లు సెంచరీలు చేసి భారత్ కు అత్యధిక పరుగులు చేయగలిగారు.ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ 410 పరుగులు చేయడం జరిగింది.
అందరు అర్థ సెంచరీలు,ఇద్దరు సెంచరీలు
ఆడిన అందరు అర్థ సెంచరీలు,ఇద్దరు సెంచరీలు చేయడం కూడా ఈ మ్యాచ్ లోనే జరిగింది.దీనితో భారత్ అత్యధిక స్కోరును నెదర్లాండ్స్ ముందు ఉంచగలిగింది.భారత బౌలర్లు విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టి బ్యాటర్ గానే కాదు బౌలర్ గానూ తాను సత్తాని నిరూపించుకున్నాడు.
భారత్ విజయం ముందుగానే ఖాయమయింది
భారత బౌలర్లలో కులదీప్ యాదవ్,జడేజా,సిరాజ్, బుమ్రా లు రెండేసి వికెట్లు తీయగా,కోహ్లి,రోహిత్ శర్మ లు ఒక్కొక్క వికెట్ తీశారు.దీనితో నెదర్లాండ్ స్కోరు పెద్దగా రాలేదు.భారత్ 410 స్కోరు చేయడమంటే ఆషామాషీ కాదు.అందుకే ముందుగానే భారత్ విజయం ఖాయమయిపోయింది.
వరసగా భారత్ ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లలో తొమ్మిందిటికి తొమ్మిది గెలిచి తన సత్తా చాటింది.ఇక సెమీ ఫైనల్స్ లో ఎలా ఆడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
_-_మరిని అప్ డేట్స్ కోసం http://www.studiobharat.com
మరియు యూట్యూబ్ https://youtube.com/@studiobharat?si=vnSld-WXF9Cj0TTs ని సబ్ స్రైబ్ చేసుకొని చదవగలరు.
What's Your Reaction?






