తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల స్టూడియో భారత్ ప్రతినిధి

May 23, 2024 - 04:31
 0  149
తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుపతి :-

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..

అనంతరం..

కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు తర్వాత మనమడికి గుండు కొట్టించి మొక్కు చెల్లించు కున్నారు.రంగనాయకుల మండపంలో రేవంత్‌ కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు.తెలంగాణ సీఎంగా బాధ్య తలు చేపట్టాక..తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్‌రెడ్డి..

స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్‌ పాలనలో తెలం గాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. 

ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి'' అని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow