రాజీనామా చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
రాజీనామా చేయను: కేజ్రీవాల్
ఢిల్లీ
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ,ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని ప్రధాని మోదీ భావించి తన అరెస్టుకు కుట్ర చేశారని ఆరోపించారు. తనను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని,ఢిల్లీ ప్రభుత్వం పడిపోతుందనేదే మోదీ కుట్ర అని,ఈ కుట్రను విజయవంతం కానివ్వనని పేర్కొన్నారు.తనను దెబ్బతీయడానికి తన తల్లిదండ్రులను వేధించవద్దని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ హితవు పలికారు.తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ అన్ని హద్దులను దాటారని పేర్కొన్నారు.
What's Your Reaction?