దవఖనా లో ఒకే రోజు ఎంత మంది శిశువులు జననం తెలుసా
మహబూబ్ నగర్ స్టూడియో భారత్ ప్రతినిధి

సర్కార్ దావఖనా లో ఒకే రోజు 44 మంది శిశువులు జననం
మహబూబ్ నగర్:
మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గర్భిణులు ప్రసవించారు.44 మంది శిశువులకు శనివారం రోజు వైద్యులు పురుడు పోశారు.గర్భిణులంతా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ తెలిపారు.44 మందిలో కొందరికి నార్మల్ డెలివరీ కాగా,ఇంకొందరికి సీజేరియన్లు జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిన విషయం విదితమే.ఇక గర్భిణిలకు నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్యులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి...మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్3..చదవండి..https://studiobharat.com/Chandrayaan-has-reached-a-critical-juncture...దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
బాలింతలను ఇంటికి తరలించేందుకు అమ్మ ఒడి వాహనాలను వినియోగిస్తున్నారు.అంతేకాకుండా గర్భిణులకు ఐరన్,ఫోలిక్ యాసిడ్ వంటి మెడిసిన్స్‌ను ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందిస్తున్నారు...
What's Your Reaction?






