ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి
తిరుమల స్టూడియో భారత్ ప్రతినిధి
తిరుమల :
అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత కుటుంబం రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది.కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత తప్పిపోయింది.
రాత్రి10 గంటల వరకూ పాప కోసం వెతికిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.చిన్నారి కోసం పోలీసులు గాలించగా..శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. ఒంటిపై గాయాలు ఉండటంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావిస్తున్నారు.
పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారి కూడా తప్పిపోవడం గమనార్హం.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...
What's Your Reaction?