జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్
రష్యా స్టూడియో భారత్ ప్రతినిధి
50 ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్..
దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి రష్యా తన రాకెట్ను ప్రయోగించింది.ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం..
మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి ఇవాళ వేకువజామున 2.10 గంటలకు 'లునా – 25' రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది.ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో..మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్ చేసేలా రష్యా ప్రణాళికలు రచిస్తోంది.
దీని ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీస్ అభివృద్ధి,జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు,అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్ కాస్మోస్ వెల్లడించింది.1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే.ఇప్పటి వరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'చంద్రయాన్-3' ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు..'లునా -25' ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది.
What's Your Reaction?